ఘాటైన బెడ్ రూమ్ సన్నివేశాలు, అర్గాజం గురించి చర్చలు, ఉద్రేక ఉద్ధీపనం గురించి గుసగుసలు.. వెరసి ఇటీవలి కాలంలో ఓటీటీ సిరీస్ లు గుండెల్లో ఎండమంటలు పెడుతున్నాయి. పట్టపగలే చలి మంట కాగుతోంది నేటి జెన్ జెడ్ యూత్. ఇప్పుడు అలాంటి మరో వెబ్ సిరీస్ షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఇది కచ్ఛితంగా `లస్ట్ స్టోరీస్` లో కొనసాగింపు భాగం అని తెలిశాక యువతరంలో ఎక్కడా లేని ఉత్సాహం కనిపిస్తోంది.
లస్ట్ స్టోరీస్ -1లో ఘాటైన శృంగార సన్నివేశాలతో రక్తి కట్టించిన రాధిక ఆప్టే, ఇప్పుడు సీజన్ 3 కోసం బరిలో దిగుతుండడంతో సీన్ మరింత రక్తి కడుతోంది. ఆప్టే మరోసారి చెలరేగిపోవడం ఖాయమన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. సీజన్ 3లో రాధిక ఆప్టే నటించే విభాగానికి విక్రమాధిత్య మోత్వానే దర్శకత్వం వహిస్తారు. అలాగే అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు, శకున్ బాత్రా ఇతర ఎపిసోడ్లకు దర్శకత్వం వహిస్తారు. నెట్ ఫ్లిక్స్ ఈ కొత్త సీజన్ కోసం భారీ పెట్టుబడులు పెడుతోంది. అందాల భామలు మరోసారి తెరను మరిగించడం ఖాయం అంటూ నెట్ ఫ్లిక్స్ భరోసానిస్తోంది. సీజన్ 3 ఈ ఏడాది చివరిలో అంటే చలికాలం ఆరంభం(డిసెంబర్)లో విడుదలవుతుంది. చలిలో మంటలు పెట్టడం ఖాయమని కూడా భావిస్తున్నారు.
లస్ట్ స్టోరీస్ మొదటి సీజన్ లో రాధిక ఆప్టే నటించిన భాగానికి అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. ప్రతిభావంతుడైన దర్శకుడు ఆప్టేలోని నటిని, గ్లామర్ కోణాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు విక్రమాదిత్య మోత్వానే మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేయగలడా లేదా చూడాలి. ఆరబోతలో హద్దులు చెరిపేసే నటిగా పేరున్న ఆప్టే ఉన్నప్పుడు అతడు నిర్మొహమాటంగా అలాంటి ప్రయత్నం చేస్తాడనే భావిస్తున్నారు.