మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా సెట్ లో ఉన్నారు. NTR 31 డ్రాగన్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని బెంగుళూరికి అతి సమీపంలో జరుగుతుంది. ఏప్రిల్ 22 నే ఎన్టీఆర్ సెట్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పై మాసివ్ యాక్షన్ సీన్స్ ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది.
అక్కడ యాక్షన్ సీక్వెన్స్ కోసం మాసివ్ సెట్ ను వేసారట మేకర్స్. అయితే సైలెంట్ గా ఎన్టీఆర్-నీల్ కలిసి షూటింగ్ చేసుకుంటుంటే.. సడన్ గా అక్కడికి వచ్చిన ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి ఆ విషయాన్ని ఇన్స్టా ద్వారా అందరికి షేర్ చేసింది. తాను డ్రాగన్ సెట్ లో మ్యాడ్ పర్సన్‌తో మ్యాడ్ సెట్‌లో అంటూ క్యాప్షన్ పెట్టడం డ్రాగన్ పై అంచనాలు పెరిగేలా చేసింది.
డ్రాగన్ సినిమా సెట్‌లో సెలబ్రేషన్ అంటూ లికిత రెడ్డి షేర్ చేసిన ఫోటో చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ప్రశాంత్ నీల్ తల వెనుక చేయి పెట్టి, అతడి భుజం పై చేయి తల పెట్టి ఉన్న పిక్ షేర్ చేసారు ఆవిడ. ఎన్టీఆర్ పిక్ లేనప్పటికీ.. ఎన్టీఆర్-నీల్ సెట్ నుంచి పిక్ అంటే ఫ్యాన్స్ ఆగుతారా...
ఇక ఎన్టీఆర్ బర్త్ డే కి డ్రాగన్ నుంచి అదిరిపోయే గ్లింప్స్ ఇచ్చేందుకు ప్రశాంత్ నీల్ కష్టపడుతున్నారట. సో ఎన్టీఆర్ బర్త్ డే కి ఎన్టీఆర్ డ్రాగన్ లుక్ అలాగే గ్లింప్స్ ఇలా రెండు ట్రీట్స్ అభిమానులకు అందబోతున్నాయని తెలుస్తుంది.