కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచే కిర్రాక్ ఆర్పీ జనసేన కండువా కప్పుకుని వైసీపీ నేతలను సోషల్ మీడియా లో ఏకి పారేసేవాడు. జబర్దస్త్ లో తనని ఆదరించిన రోజా వైసీపీ లో ఉండడం, ఎన్నికల ముందు జబర్దస్త్ బ్యాచ్ పై రోజా అనుచిత వ్యాఖ్యలు చెయ్యడంతో కిర్రాక్ ఆర్పీ ఎక్కువగా రోజా ను టార్గెట్ చేస్తున్నాడు.
మరొపక్క వైసీపీ కండువా కప్పుకుని వైసీపీ పార్టీ వాళ్లను బంతాట ఆడుకునే సీమరాజ జగన్ తప్పులను, వైసీపీ నేతల తప్పులను బూతద్దంలో పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లేవాడు. కూటమి ప్రభుత్వంలో కిర్రాక్ ఆర్పీ, సీమరాజాలు తనని, తమ అధ్యక్షుడు జగన్ ని, అలాగే రోజాపై అనుచిత వ్యాఖ్యలు, అవమానకర రీతిలో పోస్ట్ లు పెడుతూ.. సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ అంబటి రాంబాబు గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో సీమరాజ, ఆర్పీ పై కేసు పెట్టారు.
వైసీపీ పార్టీ కండువా వేసుకుని అసందర్భంగా ప్రేలాపనలు చేసే సీమరాజ, కిర్రాక్ ఆర్పీ లు చట్టం నుంచి తప్పించుకోలేరు, ఒకవేళ ప్రభుత్వం వాళ్ళను శిక్షించకపోతే తాము సుప్రీం కోర్టులో తేల్చుకుంటమంటూ పిల్లబచ్చాలపై అంబటి రాంబాబు యుద్ధం ప్రకటించేసారు.