రీసెంట్ గా వైసీపీ పార్టీ నుంచి ఎమ్యెల్సీ దువ్వడ శ్రీనివాస్ ను జగన్ సస్పెండ్ చేసారు. దువ్వాడ సస్పెన్షన్ కి వైసీపీ ఏవేవో కారణాలు చెప్పినా సోషల్ మీడియాలో మాత్రం దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి లు ఓ ఇంటర్వ్యూలో యువనేత నారా లోకేష్ ను పొగిడినందుకే దువ్వాడ ను వైసీపీ పార్టీ సస్పెండ్ చేసింది అనే టాక్ నడిచింది.
ఇప్పుడు బ్లూ మీడియా కూడా మినిస్టర్ లోకేష్ ను పొగిడేసింది. మరి జగన్ గారు బ్లూ మీడియా ను కూడా సస్పెండ్ చేస్తారా కొంపదీసి అంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే నారా లోకేష్ మినిస్టర్ అయ్యాక ప్రజాదర్భార్ పేరుతొ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నారు. దానికోసం మంగళగిరిలో ప్రత్యేకంగా ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నారు.
తాజాగా లోకేష్ నిర్వహించిన ప్రజాదర్భార్ కి ప్రజలు పోటెత్తారు, తమ తమ సమస్యలను విన్నవించుకునేందుకు ఏపీ నలుమూలల నుంచి ప్రజలు ప్రజాదర్భార్ కు వచ్చారు. లోకేష్ కూడా వారిని ఆత్మీయంగా పలకరిస్తూ ఓపిగ్గా వారి సమస్యలను అడిగి తెలుకున్నారు.
అంతేకాదు సత్వర పరిష్కారం కోసం ఆయన సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి మరీ మాట్లాడం పై వైసీపీ పెంచి పోషించిన బ్లూ మీడియా ప్రత్యేకంగా నారా లోకేష్ ప్రజాదర్భార్ ను పొగుడుతూ కథనాలు ప్రచారం చేస్తుంది. అది చూసే నెటిజెన్ల జగన్ బ్లూ మీడియాను కూడా సస్పెండ్ చెయ్యండి, లోకేష్ ను పొగిడినందుకు అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.