టిల్లు స్క్వేర్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ నుంచి ఏ రకమయిన అంటే ఏ జానర్ లో సినిమా వస్తుంది అని యూత్ ఎదురు చూసారు. అట్టర్ ప్లాప్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో స్పై థ్రిల్లర్ జాక్ అంటూ సిద్దు జొన్నలగడ్డ బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య తో కలిసి జత కట్టాడు. జాక్ చిత్రం థియేటర్స్ లో విడుదలై యూత్ ని అంతగా ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది.
టిల్లు స్క్వేర్ కి మిచ్చి ఊహించుకుంటే జాక్ దాని దరిదాపుల్లో కూడా లేకపోవడంతో సిద్దు అభిమానులు చాలా డిజప్పాయింట్ అయ్యారు. సిద్దు కూడా జాక్ చిత్రం తో హిట్ కొట్టాలనే కసితో కనిపించాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. నిర్మాతలకు జాక్ తో భారీ నష్టాలు వచ్చాయి. ఇక జాక్ చిత్ర డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.
తాజాగా జాక్ చిత్రానికి ఓటీటీ డేట్ లాక్ చేసి అధికారికంగా ప్రకటించారు నెట్ ఫ్లిక్స్ నిర్వాహకులు. మే 8 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా జాక్ స్ట్రీమింగ్ లోకి వస్తున్నట్లుగా ప్రకటించారు.