నటిగా ఉన్నతస్థాయికి చేరిన సమంత పర్సనల్ లైఫ్ లో ప్రేమను, పెళ్లిని రెండిటిని నిలబెట్టుకోలేకపోయింది. సిద్దార్థ్ తో ప్రేమ బ్రేకప్ అయ్యింది, నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లాడింది, అది కూడా విడాకులకు దారి తీసింది. ప్రస్తుతం సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తూ అనారోగ్యంతో పోరాడుతున్న సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు రాజ్ నిడమోరు తో సమంత డేటింగ్ లో ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
హిందీ వెబ్ సీరీస్ లతో పాటుగా సమంత నిర్మాతగా మారింది. సమంత నిర్మాతగా తెరకెక్కిన మొదటి చిత్రం శుభం మే 9 న రిలీజ్ కి సిద్దమైంది. ఆ చిత్రంలో సమంత గెస్ట్ రోల్ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో అందరి అటెన్షన్ తన పై ఉంచుకునేలా గ్లామర్ ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేసే సమంత ఇప్పుడు శుభం చిత్రాన్ని ఆడియన్స్ లోకి తీసుకెళ్లేందుకు మంచి స్ట్రాటజీ చూపిస్తుంది.
శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ గత రాత్రి వైజాగ్ లో జరిగింది. ఈ చిత్రంలో అందరూ కొత్త నటులే కావడంతో తన చిత్రాన్ని ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేసేందుకు సమంత కొత్తగా ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది. శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటులతో కలిసి సమంత శారీ లో స్టేజ్ పై చేసిన డాన్స్ సోషల్ మీడియా ట్రెండ్ అవడం చూసి సమంత వేరే లెవల్ ప్రమోషన్స్ అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.