Advertisement
Google Ads BL

పొలిటికల్ ఎంట్రీ పై అజిత్ హాట్ కామెంట్స్


తమిళనాట స్టార్ హీరో విజయ్ అటు సినిమాల్తో పాటుగా ఇటు రాజకీయపార్టీ పెట్టి ప్రజల ఆదరాభిమానాల కోసం కష్టపడుతున్నారు. విజయ్ తోటి హీరో, అంతే అభిమానగణం, అంతే క్రేజ్ ఉన్న మరో హీరో అజిత్ కుమార్ పొలిటికల్ ఎంట్రీపై ప్రతిసారి ఏవో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా అజిత్ కుమార్ తన పొలిటికల్ ఎంట్రీపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

Advertisement
CJ Advs

పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే సినిమా యాక్టర్స్ కి తాను శుభాకాంక్షలు చెబుతాను, కాని తనకు రాజకీయాల్లో రావాలనే ఉద్దేశం ఎంతమాత్రం లేదని అజిత్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో మార్పు తీసుకు రాగలమనే నమ్మకంతో రాజకీయ ప్రవేశం చేసేవారంతా విజయం సాధించాలనే కోరుకుంటానని అజిత్ తెగేసి చెప్పారు.

ఇండియాలో విభిన్నమతాలు, విభిన్నజాతులవారు, విభిన్నభాషలకు చెందిన 140 కోట్ల జనాభా సామరస్యంగా జీవిస్తున్నారని, వీరందరినీ ఏకతాటిపై నడిపించడం రాజకీయనేతలకే సాధ్యమవుతుందన్నారు. నటుడు విజయ్‌ రాజకీయ ప్రవేశం చేయడం సాహసోపేతమైన నిర్ణయమని అజిత్ విజయ్ రాజకీయాలపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

Ajith comments on political entry:

Ajith Honest Reply To Thalapathy Vijay Political Entry 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs