Advertisement
Google Ads BL

రెండో పెళ్లిపై జాను లిరి సంచలన ప్రకటన!


నేను రెండో పెళ్లి చేసుకుంటున్నాను అంటూ నన్ను ట్రోల్ చేస్తున్నారు. సింగర్ దిలీప్ తో కలిసి ఉన్న ఫోటో చూడగానే తనని ట్రోల్ చేస్తూ బాధపెడుతున్నారు. ఒక అన్నతో మట్లాడినా లింకులు పెట్టి మాట్లాడుతున్నారు, ఈ ట్రోల్స్ చూసి నేను ఆత్మహత్య చేసుకుంటే దానికి బాద్యులు మీరే అంటూ ఢీ సంచలనం జాను లిరి ఏడుస్తూ ఓ వీడియో వదిలిన విషయం తెలిసిందే. 

Advertisement
CJ Advs

నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టినప్పటి నుంచి జాను లిరి ఎవ్వరి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అంతేకాకుండా నిన్న ఏడుస్తూ పెట్టిన వీడియోలు జాను ఇన్‌స్టా నుంచి డిలీట్ చెయ్యడంతో ఆమెను సంప్రదించేందుకు అనేక మంది ప్రయత్నం చేస్తున్నా ఆమె 

ఇప్పటివరకూ ఎవరికీ అందుబాటులోకి రాలేదు. 

అంతలోనే జాను లిరి మరో వీడియో షేర్ చేసింది. ఇకపై తాను ట్రోలింగ్‌ను పట్టించుకోనని వీడియో విడుదల చేసింది. తాను రెండో పెళ్లి చేసుకుంటానని, పెళ్లితోనే తాను అందరికీ సమాధానం చెబుతానని ఆ వీడియోలో సంచలన ప్రకటన చేసింది. పెళ్లి తరువాత తన కొడుకుతో ఎంత సంతోషంగా ఉంటానో మీరే చూడండి అంటూ ఛాలెంజ్ చేసింది. ట్రోల్స్ కారణంగా తాను డిప్రెషన్‌లోకి వెళ్లానని, లైఫ్‌లో ఇంకా స్ట్రాంగ్ ఉంటానని ఆ వీడియోలో తెలిపింది. 

ఈలోపు జాను లిరిని వివాహం చేసుకుంటాను, అందులో తప్పేముంది అంటూ సింగర్ దిలీప్ మరో వీడియో షేర్ చేసాడు. మేము ఇష్టపడ్డాం, తప్పు చేయలేదు అంటూ వీడియోలో స్పష్టం చేసారు. 

సింగర్ దిలీప్ దేవ్గన్, జాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయని, ట్రోల్స్‌ను తట్టుకుంటామని చెప్పారు. తమని కలిసి జీవించాలని ఆకాంక్షించిన వారు, సమర్థించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. 

Jaanu Lyri sensational statement on her second marriage!:

Janu Lyri shocking Response to Second Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs