Advertisement
Google Ads BL

బలవంతంగా నటనకు బై చెబుతానేమో: అజిత్


కొన్నాళ్లుగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కథల ఎంపికపై పట్టు కోల్పోతున్నారేమో అని ఆయన అభిమానుల్లో ఎన్నో రకాల అనుమానాలు నడుస్తున్నాయి. ఆయన దర్శకుడిని నమ్ముతున్నాడా, లేదంటే కథల ఎంపికలో కన్ఫ్యూజ్ అవుతున్నాడా అనేది అభిమానులకు అర్ధం కావడం లేదు. ఇలా వచ్చి అలా సినిమా చేసేసి, ప్రమోషన్స్ లో కనిపించకుండా, తన కార్ రేసింగ్ లకు వెళ్లిపోతున్న అజిత్ విషయంలో అభిమానుల్లో అసంతృప్తి ఉన్నా, ఆయనపై వీరాభిమానం దానిని డామినేట్ చేస్తుంది. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న అజిత్ కుమార్ ఓ ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాలపై, తన నటనపై షాకింగ్ కామెంట్స్ చేసారు. నేను యాక్టింగ్ కి ఎప్పుడు గుడ్ బై చెబుతానో తెలియదు, సినిమాలను బలవంతంగా వీడాల్సి వస్తుందేమో చెప్పలేను, ఆడియన్స్ నా యాక్టింగ్ పై కంప్లైంట్ చేస్తారేమో తెలియదు, దానికన్నా ముందే అంటే ప్రేక్షాధారణ ఉన్నప్పుడే నటనను 

పక్కన పెట్టేస్తానేమో. 

జీవితం చాలా విలువైనది, నేను ఎన్నో ఎత్తుపల్లాలు చూసాను, ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను, నా బంధువుల్లో, సన్నిహితుల్లో జీవిత పోరాటాలు సాగించేవారు ఉన్నారు, అలాంటి వారిని చూస్తే లైఫ్ ఎంత ఇంపార్టెంట్ అనేది అర్ధమవుతుంది. నేను నా లైఫ్ లోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను, టైమ్ వేస్ట్ చెయ్యకుండా జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను,. 

నేను మొదట్లో అప్పులు తీర్చేందుకు సినిమాల్లోకి  వచ్చాను, మొదటి సినిమా లో నా నటన చూస్తే భయంకరంగా ఉంటుంది, నా వాయిస్ ని ఎంతోమంది విమర్శించేవారు, నేను స్టార్ అవ్వాలనే కల ఎప్పుడు కనలేదు, అలాగే విమర్శలకు కుంగిపోలేదు అంటూ అజిత్ ఆ ఇంటర్వ్యూలో సినిమాలు వదిలేస్తానేమో అంటూ అభిమానులకు షాకిచ్చే కామెంట్స్ చేసారు. 

Ajith Kumar drops details about his retirement plans:

Ajith Kumar says he could be forced into retirement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs