ఈరోజు మే 2 అమరావతిలో రాజధాని రీ-లాంచ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రధాని మోడీ చేతులమీదుగా నిర్వహించబోతుంది ఏపీ ప్రభుత్వం. వేలకోట్ల అభివృద్ధి పనులకు ప్రధానిమోడీ శంకుస్థాపన చెయ్యబోతున్నారు. అదే సమయంలో అమరావతి రాజధానికి మణిహారంగా మారనుంది క్షిపణి పరీక్ష కేంద్రం.
ఏపీ ప్రభుత్వ చొరవతో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం శుభసూచకంగా చెబుతున్నారు. ఈరోజు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో ప్రధాని మోడీ 1500 కోట్ల పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చెయ్యనున్నారు. దేశ అవసరాల దృష్యా గుల్లలమోద దగ్గర క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
అంతేకాదు క్షిపణి పరీక్ష కేంద్రం కోసం, రాబోయే రోజుల్లో 20 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్షిపణి పరీక్ష కేంద్రం అమరావతి రాజధానికి మణిహారంగా మారనుంది అనడంలో సందేహం లేదు.