ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కేంద్రమైన అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టేందుకు నేడు అమరావతి ముస్తాబైంది. మే 2 సాయంత్రం రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభము అలాగే శంకుస్థాపన కార్యక్రమాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రధాని మోడీని ఆహ్వానించింది.
ఈరోజు సాయంత్రం ప్రధాని మోడీ అమరావతికి రానున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోడీ కి స్వాగతం పలకనున్నారు. మోడీ ఎయిర్ పోర్ట్ నుంచి స్పెషల్ హెలిప్యాడ్ లో సచివాలయానికి చేరుకుని అక్కడి నుంచి సభాప్రాంగణం వరకు భారీ రోషో తో ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. సభ వేదికపై ప్రధాని మోడీ, ఏపీ గవర్నర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా మరో 14 మంది కూర్చునేందుకు వీలుగా వేదికను ఏర్పాటు చేసారు.
అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగంతో పాటుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరుల ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఏపీ ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా ఈ అమరావతి రీ-లాంచ్ కార్యక్రమాన్నీ కనీవినీ ఎరుగని రీతిలో చేపట్టనుంది.