ఇటీవల సూర్య `రెట్రో` ప్రీరిలీజ్ వేడుకలో పహల్గామ్ టెర్రర్ ఎటాక్ పై ఎమోషనల్ గా స్పందించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అతడు ఆదివాసీల్ని అవమానిస్తూ కామెంట్ చేసాడని అటు ఏపీలో, ఇటు తెలంగాణలో గొడవ మొదలైంది. ఇంతకుముందు ఏపీలోని మన్యం జిల్లా ఆదివాసీ జేఏసీ అతడిని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కోరింది.
ఇప్పుడు ఎస్.ఆర్.నగర్ (హైదరాబాద్) పోలీస్ స్టేషన్ లో విజయ్ దేవరకొండపై ఫిర్యాదు అందింది. కిషన్ లాల్ చౌహాన్ అనే న్యాయవాడి పీఎస్ లో ఫిర్యాదు చేసారు. ఆదివాసీల మనోభావాల్ని దెబ్బ తీస్తూ ఆడియో వేదికపై మాట్లాడినందున అతడిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని అతడు పోలీసులను డిమాండ్ చేసారు. అయితే ఈ కేసులో న్యాయ సలహా తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెప్పినట్టు తెలిసింది.
ఐదువందల ఏళ్ల కిందటి ఆదివాసుల్లాగా పాక్ ఉగ్రవాదులు భారతీయ టూరిస్టులపై దాడి చేసారు! అని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఆదివాసీ సమాజం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే గాక న్యాయపోరాటానికి దిగుతోంది. ఎస్.ఆర్.నగర్ పీఎస్ లో న్యాయవాది కిషన్ లాల్ చౌహన్ పీఎస్ లో ఫిర్యాదు చేసారు.