పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో సమ్మర్ వెకేషన్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని ప్రభాస్ ఇటలీ వెళ్లారు అని కొందరు, కాదు.. ప్రభాస్ కాలికి సర్జరీ చేయించుకుని విదేశాల్లో రెస్ట్ తీసుకుంటున్నారని మరికొందరు మాట్లాడుతున్నారు. ఇక ప్రభాస్ రాక కోసం ఆయన అభిమానులే కాదు ఆయనతో పని చేస్తున్న దర్శకనిర్మాతలు కూడా వెయిట్ చేస్తున్నారు.
ముఖ్యంగా రాజాసాబ్ దర్శకుడు మారుతి. మారుతి ఎందుకు ఎక్కువగా వెయిటింగ్ చేస్తున్నారు అంటే రాజా సాబ్ టీజర్ కట్ ఫినిష్ అయ్యింది. ఆ టీజర్ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అని టాక్, కానీ ప్రభాస్ వచ్చి తన పాత్ర తాలూకు డబ్బింగ్ చెప్పాలి, అప్పుడే రాజా సాబ్ టీజర్ విడుదల. అసలే మే మిడిల్ కల్లా రాజా సాబ్ టీజర్ అంటూ మారుతి హింట్ ఇవ్వడంతో అందరిలో టీజర్ పై అంచనాలు పెరిగిపోయాయి.
మరి మారుతి అనుకున్న సమయానికి రాజా సాబ్ టీజర్ వదలాలి అంటే ప్రభాస్ రావాల్సి ఉంది. ప్రభాస్ రాక కోసం ఇప్పుడు అభిమానులు వెయిటింగ్, కారణం రాజా సాబ్ టీజర్ మొతం ఇపుడు ప్రభాస్ చేతుల్లోనే ఉంది కాబట్టి.