Advertisement
Google Ads BL

WAR 2 రైట్స్ అత‌డికేనా?


గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న `వార్ 2` ఆగ‌స్టులో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా విడుద‌లకు సిద్ధ‌మ‌వుతోంది. ప‌ఠాన్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంతో 1000 కోట్ల క్ల‌బ్ అందుకున్న య‌ష్ రాజ్ ఫిలింస్, రెట్టించిన ఉత్సాహంతో వార్ 2 ని నిర్మిస్తోంది. ఈ సినిమాతో యంగ్ టైగ‌ర్ బాలీవుడ్ లో అడుగుపెడుతుండ‌డంతో అత‌డి అభిమానుల్లో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. వార్ 2 ని య‌ష్ రాజ్ బ్యాన‌ర్ మ‌రో లెవ‌ల్లో తెర‌కెక్కిస్తోంది. ఈ సినిమాలో యాక్ష‌న్ ఎపిసోడ్స్ మ‌రో లెవ‌ల్లో అల‌రిస్తాయ‌ని, వీఎఫ్ఎక్స్ ప‌నిత‌నం మైండ్ బ్లాక్ చేస్తుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

Advertisement
CJ Advs

ఇదిలా ఉంటే `వార్ 2` తెలుగు రైట్స్ ఏ పంపిణీదారుడికి ద‌క్కాయి? అన్న చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల తెలుగు మీడియాపై ఘాటైన కామెంట్ల‌తో విరుచుకుప‌డ్డ యువ‌నిర్మాత `వార్ 2` పంపిణీ హ‌క్కుల్ని ఛేజిక్కించుకున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ `వార్ 2` తెలుగు రైట్స్ అమ్మ‌కాలు పూర్తి కాలేదు. ఈ విష‌యాన్ని అత‌డే స్వ‌యంగా అంగీక‌రించాడు. ఒక‌వేళ హ‌క్కులు కొనుగోలు చేస్తే స్వ‌యంగా ప్ర‌క‌టిస్తాన‌ని కూడా చెప్పారు. 

ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం కార‌ణంగా ఈ నిర్మాత‌కు హ‌క్కులు ద‌క్కే ఛాన్సుంద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ రేసులో `వార్ 2` హ‌క్కులు కొనుగోలు చేసేందుకు పంపిణీ రంగంలోని దిగ్గ‌జాలు పోటీ బ‌రిలో దిగ‌నున్నాయ‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. హృతిక్, ఎన్టీఆర్ ల‌కు ఉన్న పాన్ ఇండియా స్టార్ డ‌మ్ దృష్ట్యా రైట్స్ కోసం భారీ మొత్తాల్ని కోట్ చేసే ఛాన్సుంద‌ని ఒక అంచ‌నా.

 

Producer Naga Vamsi gives clarity about War 2:

Naga Vamsi clarifies he not acquired Telugu distribution rights for Jr NTR-Hrithik Roshan film War2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs