నితిన్ లేటెస్ట్ చిత్రం రాబిన్ హుడ్ మార్చ్ 28 న ఉగాది స్పెషల్ గా విడుదలైంది. విడుదలకు ముందు డిఫ్రెంట్ ప్రమోషన్స్ తో అందరిలో ఆసక్తి క్రియేట్ చేసినా విడుదలయ్యాక విషయం లేకపోవడంతో డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా రాబిన్ హుడ్ ని కాపాడలేకపోయారు.
అందులోను అదే రోజు విడుదలైన మ్యాడ్ స్క్వేర్ రాబిన్ హుడ్ డిజాస్టర్ కి మరో కారణమైంది అని అందరూ మాట్లాడుకున్నారు. ఆ చిత్రం సూపర్ హిట్ అవడంతో రాబిన్ హుడ్ ని ఎవరూ పట్టించుకోలేదు. అయితే రాబిన్ హుడ్ తో పాటుగా థియేటర్స్ లో విడుదలైన మ్యాడ్ స్క్వేర్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
కానీ రాబిన్ హుడ్ ఓటీటీ రాక పై మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పుడు కూడా మే 8 నుంచి కానీ లేదా మే 10 నుంచి కానీ ఓటీటీలో రాబిన్ హుడ్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. డిజిటల్ హక్కులను దక్కించుకున్న జీ 5 త్వరలోనే దీనిపై క్లారిటీ ఇవ్వనుంది అంటున్నారు. ఒకేసారి ఓటీటీ, టీవీ ప్రీమియర్స్ గా రాబిన్ హుడ్ వస్తుంది అంటున్నారు. చూద్దాం మే 8 అయినా వస్తుందో, లేదో అనేది.