అత్తమ్మాస్ కిచెన్ పేరుతొ మెగాస్టార్ వైఫ్ సురేఖ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చెయ్యగా దానిని ఉపాసన ఎప్పటికప్పుడు ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. అత్తమ్మాస్ కిచెన్ లో ఆవకాయ్ దగ్గర నుంచి పిండివంటల వరకు, అలాగే రసం పొడి దగ్గర నుంచి రెడీమెడీ ఉప్మా వరకు అన్ని దొరుకుతాయి.
తమ ఆప్తులకు అత్తమ్మాస్ కిచెన్ నుంచి అప్పుడప్పుడు బహుమతులు కూడా పంపిస్తారు రామ్ చరణ్ ఇంకా ఉపాసన. తాజాగా ఉపాసన తన అత్తగారు సురేఖ ఆవకాయ్ అంటే కొత్త మామిడి కాయ పచ్చడి పెట్టి దానిని పూజ గదిలో పెట్టి పూజ చేస్తున్న వీడియో షేర్ చేసారు.
సురేఖ గారు అలియాస్ నా ప్రియమైన అత్తమ్మ - ఈ సీజన్ ఆవకాయ పచ్చడితో నిజంగా అందరినీ అలరించారు. ఆమెకు ఆహారం అంటే కేవలం పోషకాహారం గురించి మాత్రమే కాదు - ఇది సంస్కృతి మరియు వారసత్వాన్ని కాపాడుకునే మార్గం.. ఆర్డర్ ప్లీజ్ అంటూ ఉపాసన ఆ వీడియో కి క్యాప్షన్ పెట్టి మరీ షేర్ చేసారు.