మేడే సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మట్లాడుతూ.. కేవలం ఒక డాక్టర్, ఇంజనీర్, సైంటిస్టులు మాత్రమే గొప్ప వాళ్ళు కాదు. కష్టపడి పనిచేసే ప్రతి కార్మికుడు గొప్ప వాడే అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ తన పర్సనల్ విషయాలు పై కూడా కామెంట్ చేసారు.
నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి నాకు ఏ ఉద్యోగం చేయాలో అసలు అర్ధం అయ్యేది కాదు, నాకు మొదటి నుంచి చెమట చిందించి పనిచేయడం ఇష్టం, చిన్నప్పుడు బెంగళూరులో ఒక నర్సరీలో పని చేయడం కోసం వెళ్తుంటే మావాళ్లు అక్కడికి వెళ్లకుండా నన్ను ఆపారు. (పవన్ ఖాళీ సమయాల్లో తన ఫామ్ లోని ఆవులకు మేత ఇస్తూ ఇలా సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడేవారినే విషయం అందరికి తెలిసిందే)
కష్టపడి పనిచేసే ప్రతి కార్మికుడు గొప్ప వాడే, ఇకపై ఉపాధి కూలీలను ఉపాధి శ్రామికులు అని పిలుస్తాం అంటూ పవన్ మేడే సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మట్లాడారు.