బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ ఏ డ్రెస్ లో అయినా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. మినీ స్కర్ట్ వేసినా, లేదంటే చీర కట్టులో అయినా ఈ చిన్నది మాత్రం అద్భుతః అన్న రేంజ్ లోనే కనిపిస్తుంది. తాజాగా అలియా భట్ పైతాని చీరకట్టు లాంటి కాస్ట్యూమ్ లో కనిపించి కనువిందు చేసింది.
వేవ్స్ సమ్మిట్ లో అలియా భట్ మహారాష్ట్ర సంప్రదాయానికి ప్రతీక అయిన నౌవారి చీర కట్టులో ట్రెడిషనల్ గా కనిపించింది. ఆ చీర కట్టు కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. అలాంటి కాస్ట్యూమ్ లో అలియా భట్ చేతిలో పూల మాలతో అందంగా ఆకర్షణగా కనిపించింది.
వేవ్స్ సమ్మిట్ లో టాప్ స్టార్స్ తో కలిసి అలియా భట్ కనువిందు చేసిన పిక్స్ అలాగే వీడియోస్ అన్ని ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారాయి.