బాలీవుడ్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ అయిన జాకీ భగ్నానీ గత ఏడాది తాను ప్రేమించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ ని గోవాలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. అయితే జాకీ భగ్నానీ ప్రొడ్యూసర్ గా చేసిన భారీ బడ్జెట్ చిత్రం బడే మియా-చోటే మియా చిత్రం ఆయనకు భారీ లాస్ ని తెచ్చిపెట్టింది. ఈచిత్రం కోసం ఆస్తులను తాకట్టు పెట్టినట్లుగా ప్రమోషన్స్ లోనే చెప్పారు.
తాజాగా జాకీ భగ్నానీ బడే మియా చోటే మియా చిత్రం వలన తామెంతగా నష్టపోయమో వివరించారు. ఈ చిత్రం వలన తాము చాలా నష్టపోయామని, ఆస్తులను తాకట్టు పెట్టామని, తమ బాధ ఎవరికీ పట్టదు అంటూ హాట్ కామెంట్స్ చేసాడు. లైఫ్ లో ఈ చిత్రం వలన నేనొక గుణపాఠం నేర్చుకున్నా, ఈ చిత్రం కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టాం, ఒక సినిమాని భారీగా నిర్మించడం ఒకటే ముఖ్యం కాదు, అనే విషయం గ్రహించాం, మా కంటెంట్ ఆడియన్స్ కు నచ్చలేదు. అందులో వాళ్ళ తప్పులేదు, వారి నిర్ణయం కరెక్ట్ గానే ఉంది. మేము మా కంటెంట్ లో ఉన్న లోపాల గురించి ఆలోచించాలి.
బాక్సాఫీస్ దగ్గర మా సినిమా 50 శాతం కంటే తక్కువే కలెక్ట్ చేసింది. మా బాధ ఎవరికి చెప్పుకోము, మేము ఈ చిత్రం నిర్మించడం కోసం ఆస్తులను తనఖా పెట్టాం, ఇలాంటి విషయాలు చెప్పడం వలన ఉపయోగం ఉండదు అని తెలుసు అంటూ జాకి భగ్నానీ బడే మియా - చోటే మియా చిత్రం బాధలు బయటపెట్టాడు.