రీసెంట్ గానే మహేష్ బాబు ఇటలీ, రాజమౌళి జపాన్, ప్రియాంక చోప్రాలు అమెరికా వెళ్ళొచ్చాక.. రాజమౌళి SSMB 29 షూటింగ్ కొత్త షెడ్యూల్ రామోజీ ఫిలిం మొదలు పెట్టేసారు. మహేష్ బాబు రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణలో పాల్గొనడమే కాదు ప్రియాంక చోప్రా కూడా ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేసారు. ఈ షెడ్యూల్ లో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ లేరు. ఒడిశా షెడ్యూల్ లో పృథ్వీరాజ్ జాయిన్ అయ్యారు.
ఇక నిర్విరామంగా మే లో కూడా SSMB 29 షూటింగ్ జరుగుతుంది. ఈలెక్కన 2026 లో మహేష్ బాబు-రాజమౌళి SSMB 29 బొమ్మ థియేటర్స్ లో దద్దరిల్లడమే అనుకున్నారు. కానీ హైదరాబాద్ లో రాజమౌళి మూడో షెడ్యూల్ ని నిన్న బుధవారంతో ముగించెయ్యడమే కాదు.. ఇప్పుడు SSMB 29 షూటింగ్ కి ఏకంగా 40 డేస్ బ్రేక్ ఇవ్వబోతున్నారట.
మళ్ళీ జూన్ 10న కొత్త షెడ్యూల్ మొదలు కానుంది అని తెలుస్తుంది. నాలుగో షెడ్యూల్ లో రాజమౌళి వారణాసి సెట్లో కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఈ సెట్ కి సంబంధించిన పనులు ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. నిన్నటివరకు మహేష్-ప్రియాంక చోప్రాలపై ఓ పాట తెరకెక్కించారని తెలుస్తుంది.
సో ఈ 40 రోజుల బ్రేక్ లో మహేష్ మళ్లీ తన ఫ్యామిలీతో సరదాగా ఏ విదేశాలకో సమ్మర్ వెకేషన్స్ కి చెక్కేస్తారని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.