నేచురల్ స్టార్ నాని బ్యానర్ లో శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ చిత్రం హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా హిట్ 2 తెరకెక్కించారు, అందులో అడివి శేష్ హీరో, అన్ని క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కినవే. హిట్ 2 కూడా హిట్ అవడమే కాదు.. హిట్2 చివరిలోనే నాని అర్జున్ సర్కార్ గా హిట్ 3 లీడ్ ఇచ్చారు.
హిట్ ఫ్రాంచైజీలో భాగంగా నేడు మే 1 న నాని-శైలేష్ కొలను ల హిట్ 3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే హిట్ 3 ఓవర్సీస్ షోస్ కంప్లీట్ అవడంతో పలువురు మూవీ లవర్స్ హిట్ 3 చిత్రంపై రియాక్ట్ అవుతున్నారు. మరి నాని హిట్ 3 ఎలా ఉందొ ఒక్కసారి ఓవర్సీస్ టాక్ లోకి వెళితే..
హిట్ 3 ఫస్టాఫ్‌లో ఇన్వెస్టిగేషన్‌పై ఫోకస్ చేసి.. సెకండాఫ్‌లో చాలా ఎట్రాక్షన్స్‌తో నింపాడు. హిట్3 క్రేజీగా మాస్ యాక్షన్ ప్యాక్డ్ హిట్ బొమ్మ. ఎమోషన్‌తో కూడిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ. హిట్ 3 సినిమాతో శైలేష్ కొలను కమ్ బ్యాక్ చేసినట్టే. చాలా కేమియోలు ఆడియెన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తాయి. నాని తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు.. అంటూ ఓ ఆడియెన్ ట్వీట్ చేసాడు.
హిట్ 3 ఫస్టాఫ్ ఎక్సలెంట్‌గా ఉంది. క్రైమ్ థిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. నాని పెర్ఫార్మెన్స్ సూపర్బ్. నాని కోసమే ఈ సినిమాను చూడాలి అంటూ మరో ప్రేక్షకుడు స్పందించాడు. సినిమా యావరేజ్. ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్లకండి. చివరి 30 నిమిషాలు సినిమా బాగుంటుంది.. అంటూ మరో నెటిజెన్ ట్వీట్ చేసాడు. .
హిట్ 3 సినిమా మితిమీరిన హింసతో కూడిన రొటీన్, రెగ్యులర్ డ్రామా. కథ చాలా స్లోగా సాగుతుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ వద్ద స్టోరీ ఊపందుకొంటుంది. నాని పెర్ఫార్మెన్స్, క్యారెక్టరైజేషన్, వన్ లైన్ డైలాగ్స్ మూవీని నిలబెట్టిందని చెప్పవచ్చు.. అంటూ మరో ఆడియెన్ స్పందన ఉంది.. మరి హిట్ 3 ఓవరాల్ టాక్ కావాలంటే రివ్యూ కోసం కాస్త వెయిట్ చెయ్యాల్సిందే.