హీరో శ్రీవిష్ణు సరదాగా చేసిన జోక్స్ మిస్ ఫైర్ అయ్యాయి. శ్రీవిష్ణు లేటెస్ట్ చిత్రం సింగిల్ ట్రైలర్ లో ఆయన పలికిన కొన్ని డైలాగ్స్, శ్రీవిష్ణు అనుకరించిన కొన్ని మూమెంట్స్ పై కాంట్రవర్సీ మొదలయ్యింది. ముఖ్యంగా శివయ్యా, మంచు కురిసిపోవడం అనే డైలాగ్స్ పై మంచు విష్ణు సీరియస్ అవడమే కాకుండా ఆయన సింగిల్ టీమ్ పై కంప్లైంట్ ఇచ్చేవరకు పరిస్థితి వెళ్ళినట్లుగా సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి.
శ్రీవిష్ణు సరదాగా చేసిన కామెడీ కాస్తా మిస్ ఫైర్ అవడంతో ఆ కాంట్రవర్సీకి శ్రీవిష్ణు వెంటనే కట్ చెప్పేసాడు. అంటే శ్రీవిష్ణు వీడియో రూపంలో కన్నప్ప టీమ్ కి క్షమాపణ చెప్పాడు. ఎవరిని కించపరిచేలా ఎలాంటి దురుద్దేశాలు తమకు లేవని, కానీ మా వలన కన్నప్ప టీమ్ బాధపడిందని తెలిసి మీ ముందుకు వచ్చామని, ఏ డైలాగ్స్ అయితే ఇబ్బంది కలిగించాయో వాటిని తీసేయడమే కాక సినిమాలో కూడా ఎడిట్ చేయిస్తానని చెప్పి మరీ క్షమించమన్నాడు.
సో మే 9 కి సింగిల్ ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. కామెడీ జోనర్ లో తెరకెక్కిన సింగిల్ పై శ్రీవిష్ణు కే కాదు ట్రైలర్ చూసాక అందరిలో సింగిల్ పై నమ్మకం మొదలైంది.