అఖిల్ అక్కినేని తన బర్త్ డే కి లెనిన్ చిత్రంపై ఇచ్చిన అప్ డేట్ తో అక్కినేని అభిమానులు చాలా హ్యాపీ గా ఫీలవుతున్నారు. కారణం గత రెండేళ్లుగా అఖిల్ నటనకు లాంగ్ బ్రేక్ తీసుకున్నాడు. దానితో అక్కనేని అభిమానులు చాలా డిజప్పాయింట్ అయ్యారు. కానీ ఇప్పుడు అక్కినేని ప్రిన్స్ లెనిన్ షూటింగ్ లో బిజీగా కనిపిస్తున్నాడు.
మధ్య మధ్యలో షూటింగ్ కి బ్రేక్ వచ్చింది అంటే చాలు తనకు కాబోయే భార్య జైనబ్ తో కలిసి వెకేషన్స్ కి చెక్కేస్తూ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిస్తున్నాడు. బర్త్ డే కి జైనాబ్ ని తీసుకుని మాల్దీవులకు వెళ్లొచ్చిన అఖిల్ తాజాగా మరోసారి ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. జైనాబ్ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని ఈరోజు బుధవారం అఖిల్ ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు.
గత ఏడాది నవంబర్ లో నాగార్జున తన ఇంట్లోనే చిన్న కొడుకు అఖిల్ కి జైనాబ్ కి నిశ్చితార్ధం చేశారు. ఇక అఖిల్ పెళ్లి కోసం అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మార్చ్ లో అఖిల్ పెళ్లి ఉంటుంది అన్నప్పటికి.. ఆ నెలలో వివాహం జరగలేదు. మరి అఖిల్ పెళ్ళెప్పుడు అంటూ ఇప్పుడు అక్కినేని అభిమానులు క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు.