మలయాళంలో మోహన్ లాల్-శోభన జంటగా నటించిన తుడరుమ్ చిత్రం ఏప్రిల్ 25 న విడుదలై మళయాళంలోనే కాదు విడుదలైన ప్రతి భాషలో సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రానికి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. సినిమా బావుంది, మోహన్ లాల్ యాక్టింగ్ అదుర్స్.
మోహన్ లాల్ ఎమోషనల్ సీన్స్ లో పలికించిన హావభావాలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. అంతేకాదు మోహన్ లాల్ మరో దృశ్యం, తుడరుమ్ అంటూ ప్రేక్షకులే కాదు సినీ విమర్శకుల సైతం తుడరుమ్ కొనియాడుతున్నారు. అయితే ఈచిత్రం సూపర్ హిట్ అయినా టైటిల్ ప్లాప్ అవడం ఈ చిత్రానికి మైనస్ అయ్యింది. మలయాళంలో తుడరుమ్ టైటిల్ ఓకె. కానీ తెలుగులోకి వచ్చేసరికి ఆ టైటిల్ ని పలకడం కూడా కష్టంగా మారింది.
మల్టిప్లెక్స్ ఆడియన్స్ కే అలా ఉంటే.. BC సెంటర్ ఆడియన్స్ కు తుడరుమ్ అనే టైటిల్ ఏం ఎక్కుతుంది. సినిమా హిట్టే-టైటిల్ ప్లాప్ అన్న రీతిలో ఉంది ఇప్పుడు తుడరుమ్ పరిస్థితి. తెలుగులో టైటిల్ చేంజ్ చేసి డబ్ చేస్తే బావుండేది అనేది ఇక్కడి ప్రేక్షకుల మాట. ఈమధ్యన మోహన్ లాల్ నుంచి మరో చిత్రం L2 ఎంపురాన్ టైటిల్ విషయంలోనూ మేకర్స్ అదే తప్పు చేసారు.
L2ఎంపురాన్ అంటే ఎవ్వరికి రీచ్ అవ్వని టైటిల్. కానీ ఇప్పుడు మోహన్ లాల్ తన తుడరుమ్ టైటిల్ విషయంలోనూ సేమ్ మిస్టేక్ చెయ్యడం వలన సినిమా కలెక్షన్స్ పై ప్రభావం పడుతుంది అని అంచనా వేస్తున్నారు నిపుణులు.