Advertisement
Google Ads BL

బిగ్ డిబేట్‌లో చిరు-అల్లు అర్జున్?


ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో 2025 1మే 2025 నుంచి 4 మే 2025 వ‌ర‌కూ మొట్టమొదటి వరల్డ్ ఆడియో విజువల్ & ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES సమ్మిట్) అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి నార్త్ సౌత్ నుంచి పాపుల‌ర్ స్టార్లు హాజరవుతారని స‌మాచారం. మెస్ట్ అవైటెడ్ 2025 సమ్మిట్ నిర్వాహకులు ఇప్ప‌టికే షెడ్యూల్‌ను రూపొందించారు. వేవ్స్ మొదటి ఎడిషన్ ఈ సంవత్సరం అతిపెద్ద ఈవెంట్‌లలో ఒకటిగా నిల‌వ‌నుంది.

Advertisement
CJ Advs

ఈవెంట్లో షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, హేమ మాలిని, మిథున్ చక్రవర్తి, అక్ష‌య్ కుమార్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖ బాలీవుడ్ స్టార్లు పాల్గొన‌నున్నారు. ఆస‌క్తిక‌రంగా ఇదే ఈవెంట్లో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, కింగ్ నాగార్జున‌, విజయ్ దేవ‌ర‌కొండ‌ పాల్గొంటారు. కోలీవుడ్ నుంచి రజనీకాంత్, మాలీవుడ్ నుంచి మోహన్‌లాల్ హాజ‌ర‌వుతున్నార‌ని స‌మాచారం.

మే 1న `లెజెండ్స్ & లెగసీస్: ది స్టోరీస్ దట్ షేప్డ్ ఇండియాస్ సోల్` ప్యానెల్‌తో సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమవుతుంది. దీనికి అక్షయ్ కుమార్ మోడ‌రేట్ (హోస్ట్) చేస్తారు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, హేమ మాలిని, మిథున్ చక్రవర్తి, రజనీకాంత్, మోహన్ లాల్ త‌దిత‌రులు దీనిలో పాల్గొంటారు! ఇది ఇప్పటివరకు అత్యంత భారీ ప్యానెల్ చర్చగా నిల‌వ‌నుంది. కరణ్ జోహార్ `ది న్యూ మెయిన్ స్ట్రీమ్: బ్రేకింగ్ బోర్డర్స్, బిల్డింగ్ లెజెండ్స్` సెషన్‌ను మోడరేట్ చేస్తారు. దీనికి ఎస్ ఎస్ రాజమౌళి, ఎ ఆర్ రెహమాన్, అనిల్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ హాజరవుతారు. పుష్ప‌ స్టార్ అల్లు అర్జున్ `ఇండియాస్ క్రియేటివ్ అసెంట్: ఎం మ‌రియు ఇ లీడర్స్ ఆన్ బికమింగ్ ఎ గ్లోబల్ పవర్‌హౌస్` ప్యానెల్ లో పాల్గొంటారు. ఈ ప్యానెల్ లో జర్మన్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి అరియాన్ హింగ్స్ట్, ఇటాలియన్ మోడల్ బినాకా బాల్టి, ఇజ్రాయెల్ నటి రోనా లీ షిమోన్, యుఎస్ గాయని మేరీ జోరీ మిల్బెన్ కూడా చ‌ర్చ‌లు సాగిస్తారు.

దీని తర్వాత `మల్టిపుల్ ఇండస్ట్రీస్: బెస్ట్ ప్రాక్టీసెస్` సెషన్ జరుగుతుంది. అనుపమ చోప్రా మోడరేట్ చేస్తారు. దీనిలో షాహిద్ కపూర్, కృతి సనన్ అలరిస్తారు. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ `వేవ్స్`కు హాజరైన వారితో సంద‌డి చేస్తారు. ఫైర్‌సైడ్ చాట్ పేరు `ది జర్నీ: ఫ్రమ్ అవుట్‌సైడర్ టు రూలర్`కు కరణ్ జోహార్ మోడరేట్ చేస్తారు.

మే 2, మే 3న జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో అమీర్ ఖాన్, రితేష్ సిధ్వానీ, దినేష్విజ‌న్, న‌మిత్ మ‌ల్హోత్రా త‌దిత‌రులు పాల్గొంటారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్, కరీనా కపూర్ కరణ్ జోహార్ మోడరేట్ చేస్తున్న `సినిమా: ది సాఫ్ట్ పవర్` సెషన్ కు నానా పటేకర్ - విజయ్ దేవరకొండ హాజ‌ర‌వుతార‌ని స‌మాచారం.

అమీర్ ఖాన్ `రీడిఫైనింగ్ ఇండియన్ సినిమా` అనే మాస్టర్ క్లాస్ ను కూడా నిర్వహిస్తారు. అభిషేక్ బచ్చన్ ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. ఆయన నాగార్జున, అమితాబ్ బచ్చన్, కార్తీ , ఖుష్బులతో కలిసి `పాన్-ఇండియన్ సినిమా: మిత్ ఆర్ మొమెంటం?` సెషన్ కు హాజరవుతారు. నమన్ రామచంద్రన్ మోడరేటర్ గా ఉంటారు.

మే 3న నెట్‌ఫ్లిక్స్ సిఇఒ టెడ్ సరండోస్, `స్ట్రీమింగ్ ది న్యూ ఇండియా: కల్చర్, కనెక్టివిటీ & క్రియేటివ్ క్యాపిటల్` సెషన్‌లో ఫైర్‌సైడ్ చాట్ చేస్తారు. `OTT విప్లవం: AI, వ్యక్తిగతీకరణ & ఇంటరాక్టివ్ కంటెంట్ స్ట్రీమింగ్ ల్యాండ్‌స్కేప్‌ను ఎలా మారుస్తుందో` అనే సెషన్‌లో  ప‌లువురు మీడియా దిగ్గ‌జాలు పాల్గొంటారు. ఫర్హాన్ అక్తర్ `ది క్రాఫ్ట్ ఆఫ్ డైరెక్షన్` పై మాస్టర్ క్లాస్ నిర్వహిస్తారు. మే 4న ఢిల్లీ క్రైమ్, పోచర్ ఫేమ్ రిచీ మెహతా సినిమాలపై మాస్టర్ క్లాస్ నిర్వహిస్తారు.

 

Chiru-Allu Arjun on the same stage?:

Chiru-Allu Arjun in the big debate?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs