ఫైనల్ గా వైసీపీ ఎమ్యెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ని వైసీపీ పార్టీ వదిలించుకుంది. దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మధురితో కలిసి తిరుగుతూ భార్య పిల్లలను ఇబ్బంది పెట్టడం దగ్గర నుంచి ఇంకా చాలా విషయాల్లో అంటే పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం ఇలా ప్రతి ఒక్క విషయంలో వెనకేసుకొచ్చిన వైసీపీ పార్టీ ఫైనల్ గా తమ ప్రతిష్ట దెబ్బతింటుంది అని భావించి దువ్వాడ ను పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్టుగా దువ్వాడ పై ఫిర్యాదులు వచ్చాయని, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అంటూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసారు.
దివ్వెల మాధురితో సాన్నిహిత్యం, ఆమెతో కలిసి కొత్త జంటలా తిరగడంతో పార్టీ పరువు పోతుంది అని భావించిన జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని తెలుస్తోంది. అంతేకాకుండా రీసెంట్ గా విద్యుత్ శాఖ ఏఈకి ఫోన్ చేసి బెదిరించడం వంటి విషయాలతో దువ్వాడ చిక్కుల్లో పడ్డారు, దానితో పార్టీకి కీలకంగా ఉన్న దువ్వాడ ను చివరకు జగన్ వదిలించుకోక తప్పలేదు.