Advertisement
Google Ads BL

రామాయణలోకి ఎంటర్ అవుతున్న కన్నడ స్టార్


నితీష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సౌత్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కన్నడ పాన్ ఇండియా స్టార్ యష్ రావణుడిగా కనిపించనున్నారు. కెజిఎఫ్ తో పా ఇండియా  మార్కెట్ ను షేక్ చేసిన యష్ ప్రస్తుతం టాక్సిక్ చిత్రం చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

దానితో పాటుగా హిందీ రామాయణ లో యష్ రావణుడిగా నెగెటివ్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ వారంలో ముంబైలో రామాయణం పార్ట్ 1 షూటింగ్‌లో య‌ష్‌ పాల్గొనబోతున్నారు. ఇప్పటివరకు యష్ పై ఎలాంటి సన్నివేశాలు చిత్రీకరించలేదు, కేవలం రావణుడి పాత్ర కోసం ఫోటో షూట్ మాత్రమే చేసారు. యష్ ఎంటర్ అవగానే రావ‌ణుడి పాత్ర‌పై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌నున్నారు అని తెలుస్తోంది.

అటు టాక్సిక్, ఇటు రామాయణ చిత్రాలను యాష్ ఏకకాలంలో పూర్తి చేస్తారు అని సమాచారం. యష్ టాక్సిక్ వచ్చే ఏడాది మార్చ్ లో విడుదల కాబోతుంది. మరోపక్క రణబీర్ కపూర్ కూడా రామాయణ షూటింగ్ లో పాల్గొంటున్నారు. 

Yash all set for mythological epic:

Yash to Join the Shoot of Ramayana Part 1
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs