నిన్నమొన్నటివరకు శ్రీరెడ్డి ఎవరో మాకు తెలియదని చెప్పిన వైసీపీ నేతలు ఇప్పుడు ఆమెను విచారణకు పిలవగానే శ్రీరెడ్డి వెనుక నిలబడడం చర్చకు దారి తీసింది. సోషల్ మీడియా వేదికగా గత ఐదేళ్ళలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ల పైన మాత్రమే కాకుండా టీడీపీ లోని ప్రముఖ నాయకులైన అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు వంటి వాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి.
2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక సోషల్ మీడియాలో పోస్ట్ లు తగ్గించిన శ్రీరెడ్డి.. వైసీపీ సోషల్ మీడియా యాక్టీవిస్టులను కూటమి ప్రభుత్వం అరెస్ట్ చెయ్యడం మొదలు పెట్టగానే చంద్రబాబు, లోకేష్, పవన్ లకు సారీ చెబుతూ వీడియో వదిలి డ్రామా చేసింది. కానీ ఆమెపై పలుచోట్ల కేసులు నమోదు కావడంతో శ్రీరెడ్డి ని పోలీసులు విచారణకు పిలిచారు. విచారణలో భాగంగా అనకాపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది శ్రీరెడ్డి.
2024 నవంబర్ నెలలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి పై కేసు నమోదు కాగా ఆమె విచారణకు వెళ్ళింది. శ్రీ రెడ్డికి మద్దతుగా పాడేరు వైసీపీ ఎమ్మెల్యే మత్సరాజ విశ్వేశ్వరరావు తో పాటుగా అనకాపల్లి టౌన్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు చేరుకున్నారు.
మరి తన వెనుక జగన్ ఉన్నారు, జగన్ చెబితేనే వాళ్ళను తిట్టాను అంటూ తమ అధినాయకుడు జగన్ ను ఇరికించినప్పటికీ శ్రీరెడ్డికి వైసీపీ నేతలు, కార్యకర్తలు మద్దతుగా రావడం గమనార్హం.