హీరో రాజ్ తరుణ్ పేరెంట్స్, రాజ్ తరుణ్, శేఖర్ బాషా తనని చంపేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య గత రెండు మూడురోజులుగా మీడియాలోనే కనబడుతుంది. లావణ్య ఇంటికి రాజ్ తరుణ్ పేరెంట్స్ వచ్చి తనపై దాడి చేసారు, శేఖర్ బాషా, రాజ్ తరుణ్ తనని చంపేస్తారు, వారిపై కేసు పెడుతున్నా పోలీసులు స్పందించడం లేదు అంటూ నార్సింగి పోలీస్ స్టేషన్ లో లావణ్య మొరపెట్టుకుంది. అంతేకాదు రాజ్ తరుణ్ కి సారీ చెప్పినా కనికరించకుండా నాపై దాడి చేయించినందుకు అతన్ని వదిలేదే లే అంటూ శపధం చేసింది.
అందులో భాగంగా లావణ్య రాజ్ తరుణ్ తో ఉన్న పాత వీడియో ఒకటి వదిలింది. అందులో రాజ్ తరుణ్ దమ్ము కొడుతూ డ్రైవ్ చేస్తున్నాడు, అతని ఒడిలో కుక్కపిల్ల కూడా ఉంది. దానితో పాటుగా రాజ్ తరుణ్ పేరెంట్స్ కి బట్టలు పెట్టి రాజ్ తరుణ్-లావణ్య ఆశీర్వాదం తీసుకోగా రాజ్ తరుణ్ తల్లితండ్రులు వారిని ఆశీర్వదించిన వీడియో..
అలాగే రాజ్ తరుణ్ ఇంట్లో వినాయక పూజలో లావణ్య కూడా ఉన్న వీడియో ని సోషల్ మీడియాలో వదిలింది. మరి రాజ్ తరుణ్ తో తాను ఎప్పటినుంచొ కలిసి వున్నట్లుగా ఆ వీడియోస్ లో ఉండడం వలనే లావణ్య ఆ పాత వీడియోలను బయటపెట్టింది అంటున్నాడు.