Advertisement
Google Ads BL

మాల్స్‌లో 50శాతం స్క్రీన్లు క‌ట్


మాల్స్‌లో థియేటర్ల(స్క్రీన్ల‌)కు కేటాయిస్తున్న స్పేస్ మ‌రో 2 నుంచి 5 సంవత్సరాలలో 30-50 శాతం తగ్గవచ్చని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సినిమా థియేటర్లు పూర్తిగా క‌నుమ‌రుగు కావు కానీ.. ఓటీటీ, డిజిట‌ల్ విప్ల‌వం కార‌ణంగా థియేట‌ర్లకు వ‌చ్చే జ‌నం అమాంతం త‌గ్గిపోతున్నార‌ని, దీంతో మాల్స్ లో సినిమా స్క్రీన్లు స్పేస్ ని  కోల్పోనున్నాయ‌ని, మ‌ల్టీప్లెక్సుల‌కు అస్తిత్వ సంక్షోభం త‌లెత్త‌నుంద‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement
CJ Advs

ఓటీటీ యాప్‌లు వినియోగదారుల చేతిలో ఇమిడిపోయాయి. ఇంట్లోనే ఉండి ప్ర‌తిదీ వీక్షించే సౌలభ్యం పెరిగింది. దీంతో ఇవి నిర‌భ్యంత‌రంగా దూసుకెళుతున్నాయి. నిరంతరం జ‌నం లేక‌ థియేటర్లు వెల‌వెల‌బోతుండ‌డంతో మాల్ డెవలపర్‌లను మల్టీప్లెక్స్‌లకు కేటాయించే స్థలాన్ని త‌గ్గించేందుకు తిరిగి అంచనా వేయమని ఒత్తిడి చేస్తున్నాయని తాజా స‌ర్వే వెల్ల‌డించింది.

ఇక‌పై మాల్స్ లో థియేట‌ర్ స్క్రీన్ల‌కు కేటాయించే స్థ‌లం త‌గ్గిపోతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సినిమా వినోదాన్ని మించి డైనింగ్, ప్రత్యామ్నాయ వినోద మార్గాలు,  ఆభరణాలు, డైరెక్ట్-టు-కన్స్యూమర్ బ్రాండ్‌ల వంటి వాటికి మాల్స్ లో స్పేస్ పెర‌గ‌నుంద‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మ‌హ‌మ్మారీ త‌ర్వాత కోలుకుంది అనుకున్న సినీప‌రిశ్ర‌మ‌కు ఓటీటీల రూపంలో ముప్పు తీవ్రంగా రూపాంత‌రం చెందింది.  దీని వ‌ల్ల మ‌రో రెండు నుండి ఐదు సంవత్సరాలలో మాల్స్‌లోని థియేటర్ల కోసం 30-50 శాతం తగ్గుతుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు అంచనా వేస్తున్నారు.

Multiplexes losing out as malls cut screen numbers:

The writing is on the wall for multiplexes Malls are cutting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs