Advertisement
Google Ads BL

100 కోట్ల ఇంట్లోకి స్టార్ క‌పుల్


దీపికా పదుకొనే -రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్ లో ఆద‌ర్శ‌వంత‌మైన జంట‌. ఈ జోడీ 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి దువా అనే కూతురు కూడా ఉంది. అయితే బిడ్డొచ్చిన వేళ ఈ జంట 100 కోట్ల ఇంటిలోకి మార‌బోతున్నారు. ఇది ఒక ఎగ్జ‌యిట్ చేసే ద‌శ అని చెబుతున్నారు. తల్లిదండ్రులుగా మాత్రమే కాకుండా ముంబైలోని అత్యంత సంపన్నమైన నివాసాలలో ఒకటైన ఇంటి యజమానులుగా మారుతున్న దీపిక‌- ర‌ణ్ వీర్ ల‌పై ముంబై మీడియా వ‌రుస క‌థ‌నాలు అల్లుతోంది. షారుఖ్ ఖాన్ ఇల్లు `మన్నత్` సమీపంలో ఉన్న బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌లోని కొత్త ఇల్లు పూర్త‌యి రెడీగా ఉంది. ఇది అరేబియా స‌ముద్రానికి అభిముఖంగా అంద‌మైన వ్యూతో ఉంటుంది. దీనిని క్వాడ్రప్లెక్స్ అపార్ట్‌మెంట్ అని కూడా పిలుస్తున్నారు.

Advertisement
CJ Advs

16వ అంత‌స్తు నుండి 19వ అంతస్తు వరకు ఉన్న ప్రీమియం హై రైజ్‌లోని పై నాలుగు అంతస్తులలో విస్తరించి ఉన్న ఈ జంట‌ కొత్త ఇల్లు దాదాపు 11,266 చదరపు అడుగుల స్పేస్ తో, 1,300 చదరపు అడుగుల టెర్రస్‌తో సీఫేసింగ్ లో ఉంటుంది. ఈ ఆస్తి విలువ రూ.100 కోట్లకు పైగా ఉందని తెలుస్తోంది. లగ్జరీ, సౌకర్యం, విశాలమైన సముద్ర దృశ్యాల ఆస్వాధ‌న‌లతో ఈ ఇల్లు స్వ‌ర్గాన్ని త‌ల‌పిస్తుంద‌ని చెబుతున్నారు.

ఈ ఏడాది సెప్టెంబ‌ర్ లో కొత్త ఇంట్లోకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ కొత్త చిరునామాతో పాటు, ఈ జంటకు అలీబాగ్ లో 2021లో కొనుగోలు చేసిన రూ.22 కోట్ల బంగ్లా కూడా ఉంది.

Star couple enters 100 crore house:

Deepika Padukone and Ranveer Singh to move into a Rs 100 crore home
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs