Advertisement
Google Ads BL

అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓవర్సీస్ టాక్


కళ్యాణ్ రామ్-విజయశాంతి కలయిక లో ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం నేడు ఏప్రిల్ 18 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బింబిసార తో బౌన్స్ బ్యాక్ అయిన కళ్యాణ్ రామ్ ఆతర్వాత చేసిన సినిమాలన్నీ సో సో రిజల్ట్ తోనే సరిపెట్టుకున్నాయి. కానీ ఇప్పుడు అర్జున్ సన్నాఫ్ వైజయంతి లో విజయశాంతి నటించడంతో హైప్ క్రియేట్ అయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి చూసాను, సినిమా మీకు నచ్చుతుంది అంటూ అందరిలో విపరీతమైన ఆసక్తిని క్రియేట్ చేసారు. 

Advertisement
CJ Advs

నేడు విడుదలైన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓవర్సీస్ షోస్  ఇప్పటికే కంప్లీట్ అవడంతో అక్కడి ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఇలా ఉంది అలా ఉంది అంటూ ట్వీట్లు పెడుతున్నారు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓవర్సీస్ టాక్ లోకి వెళితే..  

పోలీస్ రోల్‌లో చాలా రోజు తర్వాత కల్యాణ్ రామ్ కనిపించాడు. అక్కడక్కడా కొన్ని సీన్లు గూస్ బంప్స్ తెచ్చేలా ఉన్నాయి. విజయశాంతి-కళ్యాణ్ రామ్ నడుమ సన్నివేశాలు హైలెట్. ఫస్టాఫ్ అయిపోయింది. ఇప్పటివరకు మూవీ యావరేజ్‌గా ఉంది.. అంటూ ఓ నెటిజెన్ ట్వీట్ చేసాడు. మొదట్లో ఫస్ట్ హాఫ్ ఆకట్టుకున్నా తర్వాత రొటీన్ కథ, కథనాలతో హీరో టెంప్లెట్ సినిమాగా మారిపోయింది. 

రెగ్యులర్ ఫార్మూలా సినిమా. బెస్ట్ ఎమోషన్స్ ఉన్నాయి. మాస్ యాక్షన్, పీక్ క్లైమాక్స్, కల్యాణ్ రామ్‌కు కమ్ బ్యాక్ సినిమా అవుతుంది.. అంటూ నందమూరి అభిమాని ట్వీట్ చేసారు. 

యాక్టర్ల క్లోజప్ షాట్స్ బాగాలేవు, మ్యూజిక్, బీజీఎం పెద్ద మైనస్. ఎలివేషన్స్‌ ఇవ్వడంలో అజనీష్ ఫెయిల్ అయ్యాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం ఏమంత గొప్పగా లేదు అంటూ మరికొందరు ఈ చిత్రంపై స్పందిస్తున్నారు. మరి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అసలు కథ ఏమిటి అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. 

Arjun S/O Vyjayanthi Overseas Talk :

Arjun S/O Vyjayanthi Social MediaArjun S/O Vyjayanthi Overseas Talk  Talk 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs