Advertisement
Google Ads BL

కోరుకున్నవాడితో పెళ్లి పీటలపై అభినయ


టాలెంటెడ్ నటి, అందానికి అందం, అభినయానికి అభినయంతో కట్టిపడేసే అభినయ ఫైనల్ గా పెళ్లి పీటలెక్కింది. కోరుకున్న ప్రియుడితో ఏడడుగులు వేసింది. హైదరాబాద్‌కు చెందిన కార్తీక్‌ ను అభినయ నిన్న బుధవారం పెళ్లి చేసుకుని వివాహబంధం లోకి అడుగుపెట్టింది. అభినయ-వేగేశ్న కార్తీక్‌ ల వివాహం జూబ్లీహిల్స్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. 

Advertisement
CJ Advs

అభినయ, కార్తీక్ వేగేశ్న చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్ షిప్ ప్రేమగా మారి పెళ్లి బంధానికి పునాదులు వేసింది. రీసెంట్ గానే కార్తీక్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని తమ ప్రేమని చెప్పిన అభినయ ఇప్పుడు పెళ్లి చేసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అభిమానులు అభినయ-కార్తీక్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

అభినయ-కార్తిక్ ల వెడ్డింగ్ రిసెప్షన్ ఈ నెల 20న నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ కార్యక్రమానికి సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరవుతారని తెలుస్తోంది. 

Abhinaya Weds Karthik Vegesna:

Actress Abhinaya Ties the Knot in a Grand Wedding Ceremony
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs