Advertisement
Google Ads BL

భక్తిని కూడా ట్రోల్ చేస్తారా..


భక్తితో తనకి నచ్చిన పని చేసినా ట్రోల్ చేస్తుంటే వారిని ఏమనుకోవాలి. సోషల్ మీడియాని మంచికి ఉపయోగించడం కాకుండా చెడుకి వాడుకునేవారిని ఏం చేసినా పాపం లేదు అంటూ కొంతమంది మాట్లాడుకోవడం నిజాంగా నిజం. ఒక అన్యమతస్తురాలు అయ్యుండి హిందూ సాంప్రదాయంలో వేంకటేశ్వరుని చెంతకు చేరి ఆ స్వామి వారికీ చెయ్యాల్సినవన్నీ భక్తితో చేసిన ఓ మహిళను కించపరిచేలా ట్రోల్ చెయ్యడం ఎంతవరకు సమంజసం. 

Advertisement
CJ Advs

అది మరెవరో కాదు, పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనోవా తన కొడుకు క్షేమం కోరి తిరుమల వెళ్లి అక్కడ డిక్లరేషన్ పై సంతకం పెట్టడం దగ్గర నుంచి తలనీలాలు సమర్పించడం, భక్తుల కోసం నిత్యాన్నదానం కోసం భారీ విరాళం ఇవ్వడం, శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొనడం, శ్రీవారి దర్శనానంతరం భక్తితో తీర్ధ ప్రసాదాలు తీసుకోవడం అన్ని మీడియాలో ఎంతగా హైలెట్ అయ్యాయో, అన్నా లెజెనోవా ని మెచ్చుకోవడం అన్ని చూసాం. 

కానీ కొంతమంది అన్నా లెజెనోవా శ్రీవారికి భక్తితో తలనీలాలు సమర్పించడంపై పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంలో పవన్ భార్య అన్నా లెజెనోవాను సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్యెల్సీ, నటి  విజయశాంతి ట్వీట్ వేశారు. దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ ఆమె హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. 

అగ్ని ప్రమాదం నుంచి తమ కొడుకు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా మెచ్చుకోవడం మానేసి ట్రోల్ చెయ్యడం అసమంజం అంటూ ఆమె ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. 

Trolls On Anna Lezhneva Over Offering Her Hair In Tirumala:

Vijayashanthi Defends Anna Lezhneva Amid Tirumala Tonsure Trolls
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs