ఏప్రిల్ 8 న అక్కినేని ప్రిన్స్ అఖిల్ బర్త్ డే. అఖిల్ బర్త్ డే కి ఈసారి అక్కినేని అభిమానులకు అద్దిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. గత రెండేళ్లుగా సినిమా సెట్స్ మీదకి వెళ్ళని అఖిల్ ఫైనల్ గా కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టాడు. అఖిల్ బర్త్ డే స్పెషల్ గా #Akhil6 టైటిల్ లెనిన్ తో పాటుగా గ్లింప్స్ వదిలారు మేకర్స్.
ఇక అఖిల్ తన బర్త్ డే ని ఫ్యామిలీతో కాకుండా తనకు కాబోయే భార్య జైనబ్ తో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నాడు. జైనబ్ తో కలిసి విదేశాలకు వెళ్లిన అఖిల్ అక్కడే తన బర్త్ డే ని జైనబ్ తో కలిసి సరదాగా సెలెబ్రేట్ చేసుకున్న పిక్స్ వైరల్ గా మారాయి.
అఖిల్ ఇంకా జైనబ్ లు మాల్దీవులు వెకేషన్ కి వెళ్ళారా అనేలాంటి లోకేషన్ లో కనిపించారు. అఖిల్ తన ఇన్స్టా లో ఫియాన్సీ జైనబ్ తో కలిసి క్లోజ్ గా హగ్ చేసుకున్న పిక్స్ షేర్ చేస్తూ My Everything అంటూ లవ్ సింబల్ ని షేర్ చేసాడు అఖిల్. ఇక అఖిల్ కొత్త ప్రాజెక్ట్ లెనిన్ షూటింగ్ అయ్యింది, మరి జైనబ్ తో పెళ్ళెప్పుడు అఖిల్ అంటూ అభిమానులు అడుగుతున్నారు.