Advertisement
Google Ads BL

ట్రోల్స్ తట్టుకోలేక ఆసుపత్రి పాలైంది


అలేఖ్య చిట్టి పికిల్స్ రుచి ఎలా ఉందొ తెలియదు కానీ.. అలేఖ్య చిట్టి పికిల్స్ ఇప్పుడు మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ అక్కాచెల్లెళ్లు పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసి ఇన్స్టా లో ఫేమస్ అయ్యారు. అయితే అలేఖ్య చిట్టి పికిల్స్ రేట్లు బాగా టూమచ్. కేజీ రెండు వేలకు పైమాటే, అరకేజీ 1400 రూపాయలు, ఈ రేంజ్ లో అలేఖ్య చిట్టి పికిల్ రేట్లు ఉండడంతో ఓ కష్టమర్ అలేఖ్య చిట్టి పికిల్స్ రేట్లపై కామెంట్ చెయ్యగా దానికి రిప్లై గా పచ్చి బూతుల ఆడియో ఒకటి బయటికొచ్చింది. 

Advertisement
CJ Advs

పచ్చళ్ళు కొనలేని నీవు పెళ్ళానికి తిండి పెడతావా అంటూ బూతులు తిట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యి అలేఖ్య చిట్టి పికెల్స్ ని బ్యాన్ చేసే దాకా వచ్చింది వ్యవహారం, అలేఖ్య చిట్టి పికిల్స్ పై దారుణమైన ట్రోల్స్, దానితో ఆ అమ్మాయిలు బిజినెస్ క్లోజ్ చేసి ఫోన్స్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. అయినా ఆగని సోషల్ మీడియా ట్రోల్స్. దెబ్బకి అలేఖ్య చిట్టి అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో సారీ చెప్పారు.

ఆ సారీ చెప్పిన వీడియోపై కూడా ట్రోల్స్ జరగడంతో అలేఖ్య డిప్రెషన్‌కు గురైనట్లు తెలుస్తోంది. దీంతో నీరసించిపోయిన అలేఖ్య చిట్టిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. తన చెల్లి సారీ చెప్పినా ఆమెను ట్రోల్స్ చెయ్యడం ఆపడం లేదని, ఇప్పుడు ఆమె పరిస్థితి దారుణంగా తయారైందని అలేఖ్య అక్క సుమి వీడియో విడుదల చేసింది. 

అలేఖ్య బ్రీతింగ్ కూడా సరిగ్గా తీసుకోలేకపోతుందని, ఆమెకు వైద్యులు కృత్రిమ ఆక్సిజన్ అందిస్తున్నట్లు తెలిపింది. తను చేసింది తప్పే అని.. సారీ అడిగింది కాబట్టి.. అందరూ యాక్సెప్ట్ చేయాలని సుమి కోరింది. తమ తండ్రి చనిపోయి మూడు నెలలేే అయిపోయిందని, మరో బాధ తట్టుకునే శక్తి తమకు లేదని కన్నీళ్లు పెట్టుకుంది. 

అంతేకాదు తమకు పచ్చళ్ల బిజినెస్, యూట్యూబ్ ఏమి వద్దని.. అలేఖ్య చిట్టి సేఫ్‌గా ఉంటే చాలని తాము కోరుకుంటున్నట్లు సుమి ఓ వీడియో విడుదల చేసింది. 

Unable to bear the trolls, she was hospitalized:

Alekhya Chitti in ICU
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs