Advertisement
Google Ads BL

గెస్ట్ రోల్‌ని రిజెక్ట్ చేసిన బాలయ్య


నందమూరి నటసింహం బాలకృష్ణ వరస హిట్స్‌తో సీనియర్ హీరోలకే కాదు,యంగ్ హీరోలకు సైతం ఛాలెంజ్ విసురుతున్నారు. డాకు మహారాజ్ హిట్ తర్వాత తన హ్యాట్రిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ 2 చిత్ర షూటింగ్‌లో బిజీగా వున్నారు. ఒకవైపు ఏపీ అసెంబ్లీ, మరో వైపు సినిమా షూటింగ్స్ అంటూ బాలయ్య పరుగులు పెడుతున్నారు. 

Advertisement
CJ Advs

తాజాగా బాలయ్య ఓ పాన్ ఇండియా ఫిల్మ్‌లో గెస్ట్ రోల్ వస్తే రిజెక్ట్ చేశారనే వార్త వైరల్ అయ్యింది. అది గోపీచంద్ మలినేని హిందీలో తెరకెక్కిస్తున్న జాట్ చిత్రంలో బాలయ్య‌ను గెస్ట్ రోల్ చేయించడానికి గోపీచంద్ ట్రై చేశారట, కానీ బాలయ్య మాత్రం ఆ ఆఫర్‌ని సున్నితంగా రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. 

జాట్ చిత్ర ట్రైలర్ చూశాక ఈ కథ బాలకృష్ణ‌కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, గోపీచంద్ మలినేని బాలయ్యకు మరో హిట్ ఇచ్చేవారు అని అందరూ మాట్లాడుకున్నారు. గతంలో గోపీచంద్-బాలయ్య కాంబోలో వీర సింహారెడ్డి చిత్రం వచ్చి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

Balakrishna Rejects Guest Role in Pan-India Film:

Nandamuri Balakrishna Turns Down Cameo Offer in Gopichand Malineni Jaat
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs