బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన హర్ష సాయి, సుప్రీత, రీతూ చౌదరి, టేస్టీ తేజ, శ్యామల లాంటి 11 మంది పై కేసులు నమోదు అయ్యాయి. బెట్టింగ్ యాప్స్ వలన డబ్బు పోగొట్టుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు, ఇలాంటి యాప్స్ ను ప్రమోట్ చెయ్యడం చట్ట రీత్యా నేరమంటూ కేసు నమోదు చేస్తున్నారు.
అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు ఓకె. మరి ఇదే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన హీరోయిన్స్ ని ఏం చేస్తారు వారిపై కూడా కేసులు పెడతారా, చర్యలు తీసుకుంటారా అంటూ నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారిలో నిధి అగర్వాల్, లక్ష్మి మంచు ఉన్నారంటూ వారు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వీడియోస్ ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.
మరి నిజంగా నెటిజెన్స్ అడగడం కాదు కానీ, వీరిపై కేసులు నమోదు చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.