గన్నవరం మాజీ ఎమ్యెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నాడు. గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో వంశీ ని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
వంశీ తరపు లాయర్ పలుమార్లు బెయిల్ పిటిషన్ వేసినా వంశీకి మాత్రం కోర్టులో ఊరట దొరకడం లేదు. తాజాగా వల్లభనేని వంశీ కి మరోసారి నిరాశ కలిగే తీర్పునిచ్చింది కోర్టు. విజయవాడ జైలు అధికారులు నేడు వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. కోర్టు వంశీకి మార్చి 25 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాకుండా అటు టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముద్దాయిగా ఉన్న వంశీ ఆ కేసులోనూ రిమాండ్ లో ఉన్నాడు. ఈకేసులో వంశీకి కోర్టు ఈ నెల 15 వరకు రిమాండ్ విధించారు.