మెగా ఫ్యామిలోకి చిన్న కోడలిగా, నాగబాబు ఇంట అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి అత్తమామలతోనే కాదు, మెగా ఫ్యామిలోని అందరితో మంచి ర్యాపొ మైంటైన్ చేస్తుంది. ఈమధ్యనే ఓ సెలెబ్రిటీ వివాహానికి టాలీవుడ్ స్టార్స్ భార్యలతో కలిసి దుబాయ్ వెళ్ళొచ్చింది. భర్త వరుణ్ తేజ్ కలిసి వెకేషన్స్ కి వెళుతుంది.
అంతేకాదు పెళ్లయ్యాక కూడా లావణ్య త్రిపాఠి నటనను కంటిన్యూ చేస్తుంది. ఆమె ఈమధ్యనే సతి లీలావతి సెట్స్ లోకి అడుగుపెట్టింది. అటు షూటింగ్ ఇటు ఇంటి బాధ్యతలతో లావణ్య త్రిపాఠి బిజీగానే కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ వదిలే లావణ్య తాజాగా ఓ స్పెషల్ ఫోటో షూట్ వదిలింది.
ఫిష్ కట్ మోడ్రెన్ వేర్ అవుట్ ఫిట్ లో లావణ్య త్రిపాఠి బ్యూటిఫుల్ గా కనిపించింది. అందాల ఆరబోత విషయంలో హద్దులు దాటని లావణ్య ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంది.