Advertisement
Google Ads BL

RGV ని వదలని కేసులు-ముంబై కోర్టు షాక్


రామ్ గోపాల్ వర్మను ఏపీ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని బెయిల్ పై బెయిల్ తెచ్చుకుని ప్రస్తుతం సేఫ్ గా కనిపిస్తున్న RGV కి ఏపీ సిఐడి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేలోపు రామ్ గోపాల్ వర్మ వెంటనే స్టే తెచ్చుకున్నారు. ఆరు వారాల పాటు రాంగోపాల్ వర్మ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని నిన్న ఏపీ హై కోర్టు స్టే ఇచ్చింది. 

Advertisement
CJ Advs

హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపు RGV కి ముంబై కోర్టు షాకిచ్చింది. రామ్ గోపాల్ వర్మ పై ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది, గతంలో ఓ నిర్మాతకు రాంగోపాల్ వర్మ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఆయన దాఖలు చేసిన కేసులో ముంబై కోర్టు షాకిచ్చే తీర్పునిచ్చింది. RGV కి మూడు నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు సదరు నిర్మాతకు 3.72 లక్షలు పరిహారంగా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. 

కానీ వర్మ ముంబై కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వర్మ పిటిషన్ ను ముంబై కోర్టు తోసిపుచ్చింది. మూడు నెలల జైలు శిక్షను రద్దు చేసేందుకు ముంబై సెషన్స్ కోర్టు నిరాకరించింది.  RGV జడ్జి ముందు హాజరై బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆప్షన్ ఇచ్చింది. అదే సమయంలో వర్మ పై నాన్ బెయిలబుల్ వారెంట్ ను కూడా జారీ చేసింది. 

Mumbai court issues non-bailable warrant against RGV:

Non-Bailable Warrant against Ram Gopal Varma
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs