పెద్దోడు-చిన్నోడిగా వెంకటేష్-మహేష్ బాబు ల కలయికలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం అప్పట్లోనే నిర్మాత దిల్ రాజు కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అన్నదమ్ముల కథలో చుట్టాల ప్రమేయంతో తెరకెక్కిన ఈ చిత్రం బిగ్ మల్టీస్టారర్ గా బ్లాక్ బస్టర్ అయ్యింది. కుటుంబ కథా చిత్రంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఎన్నోసార్లు బుల్లితెర మీద సందడి చేసింది
అయినప్పటికీ మేకర్స్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుని మార్చ్ 7 న అంటే ఈరోజు మంచి ప్రమోషన్స్ తో రీ రిలీజ్ చేసారు. బుక్ మై షోలో బుకింగ్ ఓపెన్ అవ్వగానే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బుకింగ్స్ జోరుగా సాగడం అందరికి షాకిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఆడియెన్స్ అదిరే రెస్పాన్స్ ని అందిస్తున్నారు.
థియేటర్స్ లో ఈ సినిమా సీన్స్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రీ రిలీజ్ ని అభిమానులు ఆదరించడం సరే సరి.. కాని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ ని ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ లో సెలెబ్రేట్ చేసుకోవడమే సర్ ప్రైజ్ అంటున్నారు.