Advertisement
Google Ads BL

RC 16 టైటిల్ అండ్ టీజర్ డేట్ ఫిక్స్


మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్ జగపతిబాబు దివ్యేందు వంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా రామ్ చరణ్ దివ్యేందులపై క్రికెట్ నేపథ్య సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ మార్చి తొలి వారం నుంచి దిల్లీలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్ ప్రధాన తారాగణంపై కుస్తీ నేపథ్య సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు సమాచారం.

కథ రీత్యా ఈ సినిమాలో క్రికెట్, కుస్తీతో పాటు మరికొన్ని క్రీడలకు ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. రామ్ చరణ్ ఇందులో కొత్తగా కనిపించనున్నాడు. ఆయన క్యారెక్టర్ సినిమాకు హైలైట్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్‌తో పాటు మరో రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ ఏమిటంటే మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ టీజర్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ పని చేస్తున్నారు. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు పెంచుతోంది.

RC 16 title and teaser date fixed:

RC 16 update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs