కొడాలి నాని-వల్లభనేని వంశీ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది అందరికి తెలుసు. వీరిద్దరూ కలిసి కట్టుగా వైసీపీ ప్రభుత్వంలో నోటికి వచ్చిందల్లా మాట్లాడి ఏపీ ప్రజలకు నచ్చకుండా పోయారు. వారిలో ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత ఉండడమే కాదు, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడ కేసులు పెడతారో అనే భయం వెంటాడేలా చేసింది. వంశీ-కొడాలి నాని కలిసి చేసిన అరాచకాలు, అనుచరులతో కలిసి చేసిన ఆగడాలు, 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తామనే ధీమా తో లోకేష్ పై, నారా చంద్రబాబు వైఫ్ నారా భువనేశ్వరిని ఇష్టం వచ్ఛినట్టుగా మాట్లాడడం అన్ని వారిపై వ్యతిరేఖత వచ్చేలా చేసాయి.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే వంశీ, కొడాలి వాళ్ళని టార్గెట్ చేస్తుంది అనుకుంటే న్యాయపరంగా అడుగులు వేస్తూ తొమ్మిదినెలల కాలంలో ఎట్టకేలకు వంశీ ని అరెస్ట్ చేసారు. కిడ్నప్ కేసు, టీడీపీ ఆఫీస్ దాడి కేసులో వంశీ అరెస్ట్ అయ్యాడు. దానితో వైసీపీ నేత జగన్ హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తుంది కూటమి ప్రభుత్వం, వైసీపీ నేతలను కేసులతో వేధిస్తుంది. మేము కూడా డైరీ రాస్తామంటూ వంశీ అరెస్ట్ ను ఖండించాడు.
స్నేహితుడు వంశీ అరెస్ట్ పట్ల కొడాలి నాని స్పందన కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. కొడాలి ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం తప్పు చేసింది.. వంశీ అరెస్ట్ అక్రమం అని మాట్లాడతాడు అనుకుంటే నాని సైలెంట్ గా ఉండడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒకవేళ నాని ప్రెస్ మీట్ పెట్టి వంశీ కి అనుకూలంగా మాట్లాడితే ఆతర్వాత తనెక్కడ జైలుకెళ్లాల్సి వస్తుందో అని సైలెంట్ గా ఉండి ఉంటాడంటూ టీడీపీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు.