అక్కినేని యువ హీరో నాగ చైతన్య కొన్నాళ్లుగా విజయం దక్కక సతమతమవుతున్నాడు. వరస వైఫల్యాలతో నిరాశలో ఉన్న నాగ చైతన్య కు తండేల్ హిట్ బిగ్ రిలీఫ్ నిచ్చింది అనే చెప్పాలి. అదే విషయాన్ని కింగ్ నాగార్జున సరికొత్తగా చెప్పారు. తండేల్ సక్సెస్ మీట్లో పాల్గొన్న నాగార్జున నాగ చైతన్యకు తండేల్ విజయం దక్కడం కొత్త కోడలు అడుగుపెట్టిన వేళా విశేషం అంటూ మాట్లాడారు.
అక్కినేని ఇంట కొత్త కోడలిగా అడుగుపెట్టిన శోభిత ను ఉద్దేశించి నాగార్జున ఈ రకమయిన కామెంట్స్ చేసారు. తండేల్ సినిమా విడుదలైన రోజు ఢిల్లీలో మోడీ గారి దగ్గర ఉన్నాం, నా ఫోన్ నా దగ్గర లేదు.. ఫోన్ తీసుకున్నాక తండేల్ సూపర్ హిట్ అంటూ ఫోన్స్ లో మిస్సెడ్ కాల్స్, మెసేజులతో నిండిపోయింది .
ఇదంతా శోభిత మా ఇంట కోడలిగా అడుగుపెట్టిన వేళా విశేషం, నాగ చైతన్యకు భార్యగా వచ్చిన శోభిత ఇంత విజయాన్ని తమ ఇంటికి మోసుకొచ్చింది అంటూ కింగ్ నాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.