పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువగా డిప్యూటీ సీఎం పవన్ అనే పేరు వినబడుతుంది. రాజకీయాల్లో పవన్ మార్క్ ని ఆయన అభిమానులు ఎంజాయ్ చేస్తున్నప్పటికీ హీరోగా చూడాలనే తపన మాత్రం చావట్లేదు. ఇక పవన్ కూడా రాజకీయాల్లో సెటిల్ అయ్యాక తాను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తానని ప్రామిస్ చేసారు.
అందుకు తగ్గట్టే సమయం ఉన్నప్పుడల్లా ఆయన సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ముందు హరి హర వీరమల్లు, OG సినిమాలు పూర్తి చేస్తారని అన్నట్టుగానే ఆయన హరి హర వీరమల్లు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మేకర్స్ కూడా పవన్ డేట్స్ ఇవ్వడంలో మార్చ్ 28 న వీరమల్లు రిలీజ్ అంటూ డేట్ లాక్ చేసుకున్నారు.
కట్ చేస్తే హరి హర వీరమల్లు రిలీజ్ పోస్ట్ పోన్ వార్తలు నేపథ్యంలో కుర్ర హీరోలు ఆ డేట్ పై కచ్చిఫ్ లు వేస్తున్నారు. ఇప్పటికే నితిన్ రాబిన్ హుడ్ మార్చ్ 28 అంటే, మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ ని మార్చి 27 న రిలీజ్ అంటూ మేకర్స్ ప్రకటించడం పై హరి హర వీరమల్లు పోస్ట్ పోన్ పక్కా అని చాలామంది ఫిక్స్ అవుతున్నారు.
మరి ఈ రూమర్స్ పై వీరమల్లు మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. లేదంటే పవన్ సినిమాతో పోటీకి కుర్ర హీరోలు సై అనరు కదా..!