Advertisement
Google Ads BL

అంతా జగనే చేసాడు.. : రోజా


విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ బుడమేరు వాగుకు గండి పడడంతో జలమయమయ్యాయి. ఒక పక్క కృష్ణమ్మ కన్నెర్ర చేస్తే.. మరోపక్క బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడ వాసులు వణికిపోయారు. గత ఐదు రోజులుగా సీఎం అధికారులతో కలిసి వరద ప్రభావిత ప్రాంత ప్రజల కోసం శ్రమిస్తున్నారు. ఆయన టెక్నాలజీని వాడి మరీ ప్రజలకు అన్నం పెడుతున్నారు. 

Advertisement
CJ Advs

ప్రతి ఒక్కదాన్ని వాడుకుని ప్రజలను సేవ్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ అందరితో శెభాష్ అనిపించుకుంటున్నారు. అందులో భాగంగా వరద ముంపు ప్రజల కోసం బియ్యం, ఆయిల్, బంగాళా దుంపలు, గోధుమ పిండిని సరఫరా చేసేందుకు జగన్ గతంలో ప్రవేశపెట్టిన రేషన్ వాహనాలను చంద్రబాబు వినియోగించడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

చంద్రబాబు జగన్ కి పేరొచ్చేస్తుంది అని వాటిని పక్కనపడెయ్యకుండా ప్రజలకోసం వాటిని వినియోగించడం చూసి అందరూ చంద్రబాబును అప్రిషేట్ చేస్తున్నారు. కానీ వైసీపీ నేతలు వరద ప్రాంత ప్రజలకు సహాయం చెయ్యడం మానేసి అంతా జగన్ చేసాడు, వాటిని వాడి చంద్రబాబు పేరు కొట్టేస్తున్నాడంటూ ఏడుస్తున్నారు. అందులో రోజా ముందుంటుంది. 

జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు

జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ

జగనన్న నియమించిన వలంటీర్ వ్యవస్థ

జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్

జగనన్న హయాంలో కొన్న 108, 104వాహనాలు

జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు

జగనన్న తీసుకొచ్చిన క్లీన్ ఆంధ్రా వాహనాలు

జగనన్న తీసుకొచ్చిన వై ఎస్సార్ హెల్త్ సెంట్రర్లు

ఈరోజు వరద కష్టాల నుండి విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయి... అంటూ రోజా ట్వీట్ చేసింది. ట్వీట్లు చెయ్యడం, వీడియోస్ చెయ్యడంకాదు నువ్వు ముందు ప్రజల కోసం గ్రౌండ్ లోకి దిగి సహాయం చేసి అప్పుడు మాట్లాడు. అంతేకాని జగన్ చేసాడు, జగనే అన్ని అని మాట్లాడుతున్నావ్. అంత చేస్తే జగన్ ఎందుకు ఓడిపోయాడో అనేది కూడా చెప్పు అంటూ రోజా ని నెటిజెన్స్ కామెడీ గా టార్గెట్ చేస్తున్నారు. 

Everything was done by Jagane.. : Roja:

YS Jagan ration vehicle for Vijayawada flood victims
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs