Advertisement
Google Ads BL

దేవర ట్రోల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి


దేవర నుంచి వస్తోన్న పాటలు ఒకవైపు అభిమానులను ఇంప్రెస్స్ చేస్తుంటే మరోవైపు అనిరుద్ మ్యూజిక్ పై కాపీ మరకలు వినిపిస్తున్నాయి. చుట్టమల్లే పాట మాత్రమే కాదు, ఇప్పుడు వచ్చిన దావూదీ సాంగ్ పై కూడా కాపి మరకలు కనిపిస్తున్నాయి. దావూదీ పాట ఓవైపు యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో ఉంటే మరోవైపు ఈ పాట పై ట్రోల్స్ మొదలయ్యాయి. 

Advertisement
CJ Advs

సాంగ్ రిలీజైన కాసేపటి వరకూ పాట బావుంది, అదిరింది, సూపర్ హిట్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హడావిడి చేయగా ఆ తర్వాత అసలు ట్రోల్స్, మీమ్స్ మొదలయ్యాయి. పాట లో ఎన్టీఆర్ స్టెప్స్ విజయ్ డాన్స్ ను పోలి ఉంది అంటూ, విజయ్ సాంగ్ ను కాపీ కొట్టేశారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

బీస్ట్ సినిమాలో విజయ్-పూజ హెగ్డే కాంబోలో అరబిక్ కుతు హల్మితి హబీబో పాటలో వేసిన స్టెప్స్ ని యాజిటీజ్ గా దేవర దావుదీ సాంగ్ లో దించేశారు.. విజయ్ పాటకు జానిమాస్టర్ కొరియోగ్రఫీ చేస్తే, ఈ దేవర దావుదీ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసారు అంటూ నెటిజన్లు రెండు సాంగ్స్‌ను కంపేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

అయితే పాట పై వస్తున్న ట్రోల్స్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నప్పటికి.. ఈ సాంగ్ మాత్రం యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ కొల్లగొడుతుంది. పాట లిరిక్స్ పెద్దగా ఎక్కకపోయినా ఎన్టీఆర్ డ్యాన్స్, జాన్వీ అందాలు చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూల్ అవుతున్నారు. 

Fans are unhappy with Devara trolls:

Devara - Daavudi song copy Troll
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs