Advertisement
Google Ads BL

ప్రభాస్ జోరుకు ఫ్యాన్స్ లో హుషారు


ఆచి తూచి, ఏడాదికో రెండేళ్లకో సినిమాలు చేస్తూ వస్తున్న ప్రభాస్ ఇప్పుడు ఆరునెలలకు ఒక సినిమాని విడుదల చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నారు. ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా ఆరు నెలలకో సినిమా విడుదలవుతూ రావడమే కాదు.. వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా రాజా సాబ్ ని రెడీ చేస్తున్న ప్రభాస్ స్పీడుకు ప్రభాస్ ఫ్యాన్స్ ముగ్దులవుతున్నారు. 

Advertisement
CJ Advs

రాజాసాబ్ షూటింగ్ చేస్తూనే హను రాఘవాపుడితో మూవీని స్టార్ట్ చేసిన ప్రభాస్ లైనప్ లో సలార్ 2, కల్కి 2, స్పిరిట్ ఉన్నాయి. సలార్ 2, కల్కి2 ఇప్పుడప్పుడే మొదలయ్యే సూచనలు లేవు. కానీ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ కూడా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ షాకైపోతున్నారు. 

హను రాఘవపూడి మూవీ మొదలైపోయింది. ఇప్పుడప్పుడే స్పిరిట్ మొదలు పెట్టరని అనుకుంటున్నారు. సందీప్ వంగ స్పిరిట్ స్క్రిప్ట్ లాక్ చేసేసే పనిలో ఉన్నాడు, ప్రభాస్ పోలీస్ పాత్రపై సందీప్ రెడ్డి చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ని బాగా ఇంప్రెస్స్ చేసాయి. ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ చిత్రాన్ని జనవరి నుంచి ప్రారంభించే ఆలోచన చేస్తున్నాడని తెలుస్తుంది. 

ఈ నాలుగు నెలల్లో సందీప్ రెడ్డి వంగ పక్కా స్క్రిప్ట్ తో రెడీ గా ఉంటాడని, ప్రభాస్ ఇచ్చే డేట్స్ ని బట్టి షూటింగ్ ప్లాన్ చేసుకుంటాడని తెలుస్తుంది.

Prabhas fans are raving about it:

Prabhas To Begin Spirit Shoot By January 2025?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs