Advertisement
Google Ads BL

ఆ హీరోకు రెండు మరిచిపోలేని శుక్రవారాలు


హీరోలకైనా, నటులకైనా, దర్శకులకైనా, నిర్మాతలకైనా, సినిమాలకు సంబంధించి ఎవ్వరికైనా తల రాతను మార్చేది మాత్రం శుక్రవారమే. ఎందుకంటే శుక్రవారమే సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఆ రోజే సినిమా వాళ్ళ తల రాత ఎలా ఉందో తేలిపోతుంది. ప్రేక్షకులు మెచ్చారా, లేదంటే తిట్టారా అనేది మొదటి షోకే క్లారిటీ వచ్చేస్తుంది. 

Advertisement
CJ Advs

ఇప్పుడొక హీరోకి రెండు శుక్రవారాలు వెంట వెంటనే షాకిచ్చాయి. ఆయనే రాజ్ తరుణ్. కెరీర్ ని స్లోగా లాక్కోస్తున్న రాజ్ తరుణ్ కి మాజీ లవర్ షాకిచ్చింది. అది మీడియాలో బాగా ప్రచారంలో ఉన్న సమయంలో రాజ్ తరుణ్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. అది కూడా బ్యాక్ టు బ్యాక్ రెండు శుక్రవారాల్లోనే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి పురుషోత్తముడు. అసలా చిత్రాన్ని పట్టించుకున్న ప్రేక్షకుడు లేడు.

ఆ తర్వాత పర్సనల్ ఇష్యుని ప్రమోషన్ కి జోడించినా తిరగబడరా సామికి పని జరగలేదు. ఆ చిత్రము రాజ్ తరుణ్ కి బిగ్ షాకిచ్చింది. తిరగబడరా సామికి కనీస ఓపెనింగ్స్ కూడా లేవు. లావణ్య అనే యువతిని మోసం చేశాడంటూ రాజ్ తరుణ్ పై ఆరోపణలున్నాయి. ఇలాంటి సమయంలో ఆ పర్సనల్ ఇష్యు తన మూవీస్ ప్రమోషన్స్ కి హెల్ప్ అవుతాయేమో అనుకున్నాడేమో.. కానీ అదే ఇష్యు రాజ్ తరుణ్ ని ఎంతోకొంత డ్యామేజ్ చేసింది అని చెప్పాలి.

పాపం నిజంగా రాజ్ తరుణ్, రెండు శుక్రవారాలు వెంట వెంటనే రెండు డిజాస్టర్స్ కట్టబెట్టాయి. 

Two unforgettable Fridays for the hero:

Two Fridays gave Raj Tarun a big shock
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs